దేవరలో వరద చెల్లెలు ఉమ.. మన వరంగల్ పిల్లే
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా ఉంది. అయితే ఈ సినిమాలో ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా ఉమ పాత్రలో నటించి మెప్పించింది మాన్సీ వర్మ.
ఇది తనకు రెండో సినిమా. ముందుగా తనను ఈ సినిమాలో శ్రీకాంత్ చెల్లిగా బ్లైండ్ అమ్మాయి పాత్రకు అనుకున్నారని లక్కీగా ఎన్టీఆర్ చెల్లెలుగా ఛాన్స్ వచ్చిందన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం ఇష్టమని అంటుంది మాన్సీ వర్మ. ముందుగా మ్యూజిక్ షో మూర్తి సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. లా కంప్లీట్ చేసిన మాన్సీది వరంగల్ .. ఈమెకు సూర్య ఫేవరెట్ హీరో. చిన్నగా కనిపించడం వలన చాలా సినిమాల్లో ఆఫర్లు మిస్ అయ్యానని అంటుంది మాన్సీ. త్వరలోనే ఫుల్ లెన్త్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మాన్సీ.
Related News
-
నాదర్గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు



