చిరు-పూరి ‘ఆటో జానీ’.. అదిరిపోయే అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకున్న తరువాత టాలీవుడ్ రే ఎంట్రీ కోసం ఆటో జానీ అనే సినిమా చేస్తున్నట్టు, ఆ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తప్పుకున్న తరువాత టాలీవుడ్ రే ఎంట్రీ కోసం ఆటో జానీ అనే సినిమా చేస్తున్నట్టు, ఆ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ, ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇక ఇంతకాలానికి ఆ సినిమాకి మోక్షం వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో చిరు చెప్పినట్టుగా ఆటో జానీ సినిమా సెకండ్ హాఫ్ మార్చి పక్కా స్క్రిప్ట్ రెడీ చేశాడట పూరి. అంతే కాదు మెగాస్టార్ ప్రజెంట్ క్రేజ్ కి సరిపడా మార్పులు కూడా చేశాడట. త్వరలోనే చిరుని కలిసి కథను వినిపించనున్నాడట పూరి. అన్నీ ఓకే అయితే వెంటనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర, శ్రీకాంత్ ఓదెల సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక పూరి సినిమా పట్టాలెక్కనుంది.



