హాట్ హాట్ ఫొటోషూట్ .. అనన్య ఫోజులకు కుర్రకారు ఫిదా
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనన్యకు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. హాట్ హాట్ ఫొటోషూట్లతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది.

ఐదేండ్ల కిందట వచ్చిన ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అచ్చ తెలుగు అందం అనన్య నాగళ్ల. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టిన అనన్య.. హైదరాబాద్ లో బీటెక్ చేసింది. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ఇన్ఫోసిస్ తో ఐటీ జాబ్ ను వదిలేసుకొని షార్ట్ ఫిలిమ్స్ వైపు ఫోకస్ పెట్టింది.
2017లో వచ్చిన ‘షాదీ’ షార్ట్ ఫిల్మ్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రియదర్శి లీడ్ రూల్ లో నటించిన ‘మల్లేశం’ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది అనన్య. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మల్లేశం సినిమా నుంచి ఉత్తమ నటిగా ‘సైమా’ అవార్డుకు అనన్య నామినేట్ అయింది. మల్లేశం సూపర్ హిట్ కావడంతో అనన్యకు ఆఫర్లు క్యూ కట్టాయి. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి, తంత్ర సినిమాలతో పాటు ఈ ఏడాది రిలీజైన ‘డార్లింగ్’లోనూ నటించి మెప్పించింది.
ప్రస్తుతం అనన్య నటించిన ‘పొట్టేల్’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనన్యకు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. హాట్ హాట్ ఫొటోషూట్లతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో అప్ లోడ్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.