ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేయడం ఎలా?..ఈ డీటెయిల్స్ చూడండి
కిరాణా వ్యాపారుల నుండి కూరగాయల అమ్మకందారుల వరకు అంతా UPI ని వాడుతున్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలోనే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (UPI)ను ఉపయోగించి నగదు లావాదేవీలు జరుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ Paytm, PhonePe, BHIM, GooglePay వంటి UPI సపోర్టింగ్ యాప్ ల ద్వారా పేమెంట్స్ చాలా ఈజీ అవుతున్నాయి. కిరాణా వ్యాపారుల నుండి కూరగాయల అమ్మకందారుల వరకు అంతా UPI ని వాడుతున్నారు. ఆఖరికి బిచ్చగాళ్లు కూడా యూపీఐని వాడుతున్నారు. చిల్లర లేకుంటే ఫోన్ పే చేయండి..పేటీఎమ్ చేయండి అంటూ చిచ్చగాళ్లు కూడా అప్ డేట్ అయ్యారు. యూపీఐ విధానం లేనప్పుడు అన్ని చోట్లా నగదు కొనుగోళ్లు జరిగేవి. బయటకు వెళితే డబ్బులు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ముఖ్యంగా చిల్లర సమస్య వేధించేది. యూపీఐ చెల్లింపులతో ఆ సమస్యలన్నింటికీ చెక్ పడింది. అయితే ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్
ఇంటర్నెట్ లేకుండా పేమెంట్ చేయడానికి ఒక మార్గం ఉంది. దీనికోసం మీరు USSD సర్వీస్ ని ఉపయోగించాలి. దీని కోసం ముందుగా మీరు మీ GSM స్మార్ట్‌ఫోన్‌లో ‘*99#’ డయల్ చేసి, సూచనలను అనుసరించండి. అయితే అన్ని మొబైల్ సేవా ఆపరేటర్లు ఈ సర్వీస్ కి సపోర్ట్ ఇవ్వరు.
బటన్ ఫోన్ లు లేదా ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా UPI
NPCI ప్రకారం..ఫీచర్ ఫోన్ లేదా బటన్ ఫోన్ వాడేవాళ్లు కూడా IVR నంబర్ ద్వారా UPI లావాదేవీలు చేయగలరు. దీని కోసం మీరు IVR నంబర్‌కు (080-45163666, 08045163581, 6366200200) కాల్ చేసి మీ UPI IDని ధృవీకరించాలి. ఇప్పుడు మీరు కాల్లో ఇచ్చిన సూచనలను అనుసరించిన తర్వాత మీ చెల్లింపును చేయాలి.