Maruti Suzuki: రూ. 7 లక్షల్లో సరికొత్త మారుతీ సుజుకీ డిజైర్
Maruti Suzuki: మారుతీ సుజుకీ నుంచి సరికొత్త డిజైర్ కారు లాంచ్ అయింది. మూడవ తరం సెడాన్ సెగ్మెంట్లో ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో మెరుగైన శైలి, సామర్థ్యం, సేఫ్టీతో డిజైర్ కారును అందుబాటులోకి తీసుకొచ్చారు.

Maruti Suzuki: మారుతీ సుజుకీ నుంచి సరికొత్త డిజైర్ కారు లాంచ్ అయింది. మూడవ తరం సెడాన్ సెగ్మెంట్లో ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో మెరుగైన శైలి, సామర్థ్యం, సేఫ్టీతో డిజైర్ కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 9 రకాల వేరియంట్స్ ఉండగా కొన్నింటికి సన్ రూఫ్ కూడా ఉండనుంది. కాగా, కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో సేఫ్టీకి, 24.79kmplతో మైలేజ్‌కి అధిక ప్రాధాన్యత నిచ్చింది. LXI వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 6,79,000లుగా నిర్ణయించారు. దీని టాప్ మోడల్ ధర రూ.10.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
మారుతి డిజైర్ కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు ముందు, వెనుక… రెండు భాగాల్లో ఎల్ఈడీ లైట్లు అందించారు. ఈ కారులో 15 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మారుతి లాంచ్ చేసిన ఈ కొత్త కారులో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు గ్లోబల్ ఎన్సీఏపీ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ రేటింగ్‌ను పొందిన మొదటి మారుతి కారు ఇదే. గతంలో కొన్ని మారుతి కార్లు ఫోర్ స్టార్ రేటింగ్ వరకు వెళ్లాయి. కానీ ఫైవ్ స్టార్ మాత్రం పొందలేదు.