నాకు ప్రాణం పోసింది ఆ డాక్టరే – కేంద్ర మంత్రి బండి సంజయ్

పల్లవి, వెబ్ డెస్క్ : తాను ఈరోజు బతికి ఉన్నానంటే దానికి కారణం మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ శరత్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గతంలో తనకు కరీంనగర్ లో హార్ట్ ఎటాక్ వచ్చి స్ప్రుహ తప్పి పడిపోతే స్థానిక ఆసుపత్రికి తీసుకుపోతే బతకడం కష్టమని, ఇంటికి తీసుకెళ్లాలని తమ కుటుంబానికి చెప్పారని, ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న డాక్టర్ శరత్, డాక్టర్ సాహు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక డాక్టర్లతో 4 గంటలపాటు మాట్లాడి తనను బతికించారని చెప్పారు. ఈరోజు సికింద్రాబాద్ లోని ‘మెడికోవర్ ’ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గణేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే….
మెడికోవర్ (MEDICOVER) నెట్ వర్క్ ఇండియాతోపాటు జర్మనీ, పోలెండ్, బల్గేరియా, ఉక్రెయిన్ వంటి 12 దేశాలకు విస్తరించింది. 23 వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేశారు. 18 మల్టీ స్పెషాలిటీ, 2 ఉమెన్ అండ్ చైల్డ్ 3 క్యాన్సర్, 2 ఓపీడీ ఆసుపత్రులను నెలకొల్పారు. డాక్టర్ అనిల్ క్రిష్ణ (మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్) ఆధ్వర్యంలో అత్యాధునిక టెక్నాలజీ, సీనియర్ మోస్ట్ డాక్టర్లతో అద్బుతమైన సేవలందిస్తున్నారు. హెల్త్ కేర్ రంగంలో రికార్డు స్రుష్టిస్తోంది. ఇండియాలో 16 నగరాల్లో 23 ఆసుపత్రులను ఏర్పాటు చేసి 1200 మంది డాక్టర్లతో ఇప్పటి వరకు కోటి మందికిపైగా సేవలందించడం గొప్ప విషయం. 13 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ముందుకు పోతున్నారు. తెలంగాణ విషయానికొస్తే… 6 చోట్ల (హైటెక్ సిటీ, చందానగర్, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్), ఏపీలో నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం, వైజాగ్, కాకినాడ, విజయనగరం జిల్లాల్లో విస్తరించి తెలుగు ప్రజలకు విస్త్రతమైన వైద్య సేవలను అందించడం చాలా సంతోషంగా ఉంది.
యూరప్ లో పాపులర్ ఆసుపత్రి ఏదంటే మెడికోవర్ అని చెబుతారు. నా ద్రుష్టిలో కూడా బెస్ట్ హాస్పిటల్ ఏదంటే మెడికోవర్ అని చెబుతా. దానికీ కారణముంది. ఈ ఆసుపత్రి డాక్టర్ శరత్ రెడ్డి గారు నాకు ప్రాణం పోశారు. ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం డాక్టర్ శరత్, డాక్టర్ సాహు గార్లే కారణం. 2012లో కరీంనగర్ లో ర్యాలీ తీస్తుంటే హార్ట్ స్ర్టోక్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకొస్తే మీ అబ్బాయి బతకడం కష్టం, ఇంటికి తీసుకెళ్లండని డాక్టర్లు మా అమ్మకు చెప్పారు. అప్పుడు మా సిస్టర్ డాక్టర్ సౌమ్య డాక్టర్ శరత్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాహుతో మాట్లాడారు. 3, 4 గంటలపాటు కష్టపడి నన్ను బతికించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మ. దీనికి కారణం డాక్టర్ శరత్, డాక్టర్ సాహుయే. మెడికోవర్ ఆసుపత్రి వైద్యుల సేవల భేష్. ఇయాళ సికింద్రాబాద్ లో ఇంత పెద్ద హాస్పిటల్ ను నిర్మించడం, ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది.
వైద్యో నారాయణ హరి అంటాం. ప్రాణం పోసే డాక్టరే మనకు ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. దురద్రుష్టమేందంటే కొందరు డాక్టర్లు, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ట్రీట్ మెంట్ కు వచ్చే రోగులను పీడిస్తున్యి. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నరు. ఎందుకంటే ఆసుపత్రి బిల్లులు భరించలేనంతగా ఉన్నాయి. తొలుత ఆసుపత్రిలో చేరినప్పుడు ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చయితదని చెబుతారో… డిశ్చార్జ్ అయ్యే నాటికి అంతకు ఐదారు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు.
ఆసుపత్రులంటే భయపడే పరిస్థితి ఉన్న ఈరోజుల్లో భయం వద్దు… ఆసుపత్రి అంటే భరోసా కల్పించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది. మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం ‘మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డు’ను ప్రవేశపెట్టడం గొప్ప విషయం. ఈ కార్డు తీసుకున్న కుటుంబ సభ్యులందరికీ 15 నుండి 50 శాతం వరకు ఆసుపత్రి బిల్లులో డిస్కౌంట్ ఇస్తుండటం శుభపరిణామం. ఆసుపత్రికి భారమైనప్పటికీ రోగులను ద్రుష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. పేదలకు వైద్య సేవలందించే విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు మరింత ఉదారంగా వ్యవహరించాలని, ఈ విషయంలో మెడికోవర్ ఆసుపత్రి యాజమాన్యం ముందుండాలని కోరుకుంటున్నాను అని అన్నారు….
Related News
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం
-
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
సకల జనుల సమ్మేళనంతో బతుకమ్మ ఉత్సవాలు