మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మద్యం ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఈనెల ఆరో తారీఖున వినాయక నిమజ్జనం ఉన్నందున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అటు ఆదిలాబాద్ లో ఈనెల నాలుగు, ఆరో తారీఖున ఆయా ప్రాంతాల వారీగా మద్యం షాపులను మూసేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈనెల ఐదో తారీఖున మద్యం దుఖాణాలు మూసేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు.