కేంద్ర మంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి తుమ్మల భేటీ

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో రైతులు పండించే ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25000 కనీస మద్ధతు ధర కల్పించేలా ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రి శివరాజ్ కు మంత్రి తుమ్మల విజ్ఙప్తి చేశారు.
తెలంగాణలోని నారాయణపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడం జిల్లాలను ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY) పథకంలో చేర్చాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ యంత్రాలపై, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న 12 శాతం జిఎస్టీని మినహాంచాలి. పాస్పరస్ (P), పొటాషియం (K), సల్ఫర్ (S) వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమానంగా ధరలో సమతుల్యత తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు.