గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

పల్లవి, వెబ్ డెస్క్ : విఘ్నూలను తొలగించే ఆది దేవుడు గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా భూపాలపల్లి పట్టణంలో ది కాకతీయ ఖని కోల్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి కి పూజలు చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు వడ్డించి ప్రారంభించారు.
అనంతరం సాయి గణేష్ వినాయక కమిటీ హనుమాన్ నగర్ ఫేజ్ – 2, లక్ష్మీ నగర్(జంగేడు రోడ్), సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఎల్బీ నగర్, గాంధీ కాలేజీ(ఎల్బీ నగర్), లక్ష్మీ నగర్ 2వ వీధి తో పాటు గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, గణపురం మండల కేంద్రంలో వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక స్వామికి పూజలు చేసి, మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద వినాయక స్వామి వారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఐక్యత, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులను అందించాలని విఘ్నేశుడిని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు