రాత్రి పూట 9తర్వాత భోజనం చేస్తున్నారా..?

పల్లవి, వెబ్ డెస్క్ : సహజంగా ఈరోజుల్లో చాలా మంది రాత్రి పూట తొమ్మిది గంటల తర్వాతనో.. పది గంటల తర్వాతనో.. లేదా మిడ్ నైటో డిన్నర్ చేస్తారు.
అయితే, ఇలా సమయం సందర్భం లేకుండా డిన్నర్ చేసేవాళ్లకు పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి పూట పడుకునే ముందు దాదాపు మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి. అలా కాకుండా తొమ్మిది గంటల తర్వాత భోజనం చేస్తే క్యాన్సర్, ఊబకాయం, ఎసిడిటీ, గుండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్ -2 , ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.