రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వలన ప్రజలందరూ విసిగిపోయారు, మోదీ నాయకత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు తో కల్సి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న చరిత్రాత్మక నిర్ణయాలు, ఆర్థిక సంక్షేమాభివృద్ధి కోసం ప్రారంభించిన అనేక పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపై ఉందని ఆయన పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.