దివ్వెల మాధురికి బిగ్ షాక్.. తిరుమలలో కేసు నమోదు
దివ్వెల మాధురికి బిగ్ షాక్ తగిలింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించారంటూ పోలీసుల కేసు నమోదు చేశారు
దివ్వెల మాధురికి బిగ్ షాక్ తగిలింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించారంటూ పోలీసుల కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే… అక్టోబర్ 7 వ తేదీన.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట రీల్స్ చేయడంపై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇది టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమే అవుతుందని.. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంటూ సహజనం చేస్తున్నామని చెప్పడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ ఏవీఎస్వో ఏం మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. . దువ్వాడ తన భార్య వాణిని విడిచిపెట్టి… దివ్వెల మాధురితో కలిసి టెక్కలిలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఉంటున్నారు. దీంతో గత నెల రోజులుగా దువ్వాడ భార్య, పిల్లలు ఆ ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ అదిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి ఇన్ ఛార్జ్ పోస్టు నుంచి తప్పించింది.
ఇప్పుడు టెక్కలిలో దువ్వాడ ఉంటున్న ఇల్లు తనదేనని అంటుంది మాధురి. గతంలో దువ్వాడకు ఏం ఆశించకుండా రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చానని.. ఇప్పుడు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా దువ్వాడ ఆ ఇల్లును తన పేరున రిజిస్ట్రేషన్ చేశారని మాధురి అంటుంది. తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం మరింత హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది.
Related News
-
నాదర్గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు



