ఇక బతుకమ్మ చీరలు బంద్.. వాటి స్థానంలో!
బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం తరుపునఅందించే చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చీరల పంపిణీకి స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో వాటి స్థానంలో నగదు లేదా ఏదైనా బహుమతులు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో నిర్వహించనున్న సమీక్షలో సీఎం రేవంత్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దానిపైనా చర్చించనున్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ కానుక కింద.. చీరలు అందించారు. అయితే.. ఈ బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని.. చీరల్లో నాణ్యత లేదంటూ స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కూడా చీరలు పంపిణీ చేస్తే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట రేవంత్. బతుకమ్మ చీరల నాణ్యత, పంపిణీ విషయంలో తమ ప్రభుత్వం కూడా మారాల్సి వస్తుందని భావిస్తున్న తరుణంలో పూర్తిగా బతుకమ్మ చీరల విక్రయాలను నిలిపివేయాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తుందని తెలుస్తోంది.
ఏపీలో అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి అక్కడి ప్రజలకు ఉచితంగా చక్కెర, బెల్లం, ఆయిల్, నెయ్యి, కందిపప్పు, శనిగలు పంపిణీ చేస్తారు. అదే తరహాలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తెలంగాణలో కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ అందించాలని కసరత్తు నిర్వహిస్తున్నట్లు సమాచారం
Related News
-
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నరసింహారెడ్డి
-
13 మంది ఐఏఎస్ల బదిలీ.. స్మితా సబర్వాల్కు కీలక బాధ్యతలు
-
బతుకమ్మతో కవిత రీ ఎంట్రీ!
-
రూరల్ రూట్స్ నుండి టెక్ ఇన్నోవేటర్ వరకు.. బుచ్చిరెడ్డి ఇన్స్పిరేషన్ స్టోరీ
-
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఎక్స్గ్రేషియా పెంపు
-
విద్యా భరోసా ఊసే లేదు .. విద్యాశాఖ మంత్రి ఎక్కడ?



