కవితకు ఎంపీ రఘునందన్ రావు సలహా

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడిన దాంట్లో కొత్తగా ఏమి లేదని, కవిత ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేదని బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత ఇప్పుడు చెప్పారు కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కుమ్మక్కయ్యారని గతంలోనే చెప్పానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కవిత ఆరోపించిన విధంగా మోకిల ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలని రఘునందన్ రావు కోరారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో మాజీ సీఎం కేసీఆర్‌కు చెప్పానని, కానీ ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూసినట్లు కూడా గతంలోనే చెప్పానని ఆయన అన్నారు.
క