కవిత సంచలన నిర్ణయం..!

పల్లవి, వెబ్ డెస్క్ :హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఇటు బీఆర్ఎస్ సభ్యత్వానికి, అటు ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామా లేఖలను మీడియాకు చూపించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ” తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటన వచ్చిందని” ఆమె తెలిపారు. అంతేకాదు, తన సస్పెన్షన్ ఆర్డర్ ను చదివి వినిపించారు.
నేను ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా నన్ను సస్పెండ్ చేశారట అని కవిత చెప్పారు. తన ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆమె స్పష్టం చేశారు. తన అభిమానులు, జాగృతి కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కవిత ఈసందర్భంగా తెలిపారు.