వేగంగా విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ..15 వేలకు పైగా 4జీ టవర్ల ఏర్పాటు పూర్తి

ప్రైవేట్ సంస్థల ధరల వల్ల ప్రజలు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం టెలికం సర్వీసును వేగంగా విస్తరిస్తున్నది. ఈ మేరకు దేశంలో15 వేలకు పైగా 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర టెలీకమ్యూనికేషన్ శాఖ మంగళవారం ‘ఎక్స్’లో పేర్కొంది. 2025 మార్చి నెల నాటికి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో టవర్లు ఏర్పాటు చేస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది.