BSNL నష్టాలు తగ్గినయ్..

పల్లవి, ఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ నష్టాలు తగ్గినట్లు కేంద్రం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,161 కోట్ల నష్టం వస్తే.. ఈ సారి అది రూ.5371 కోట్లకు తగ్గిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏబిటీ ఆదాయాలు రూ.2164 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే 2021 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్ లాభాలు అర్జిస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో 4జీ టెక్నాలజీ విస్తరణ కోసం బీఎస్ఎన్ఎల్ లక్ష 4జీ సెట్లను ఆర్డర్ చేసిందని తెలిపారు. వీటీని ఈజీగా 5జీకి అప్గ్రేడ్ చేయొచ్చన్నారు.