బెస్ట్ ప్లాన్స్ తో BSNL 4G.. జియో, ఎయిర్టెల్ ఇక ఖేల్‌ఖతం!

దేశంలోని ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వొడాఫోన్ లు ఇటీవల తమ టారీఫ్ లను భారీగా పెంచాయి. దీంతో వినియోగదారులు అసంతృప్తిలో ఉన్నారు. జీయో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ల మొబైల్ రిచార్జ్ లను భరించలేమంటూ ఇతర నెట్ వర్క్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ BSNL నెట్ వర్క్, ప్లాన్ల పై సెర్చ్చేస్తున్నారు. ప్రస్తుతం 2G/3G నెట్‌వర్క్‌తో కొనసాగుతున్న BSNL.. కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులో తీసుకొచ్చింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా 4G సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. అంతేకాదు.. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలను అందించే రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. BSNL 365 రోజుల చెల్లుబాటుతో అత్యంత సరసమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.
రూ.1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను BSNL 365 రోజుల వ్యాలిడీటితో తీసుకొచ్చింది.
ఈ ప్లాన్ నెలకు 3GB డేటా, 30 SMSలతో 300 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అలాగే.. రూ. 1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను 365 రోజులు వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల పాటు 600GB డేటాతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు100 SMS అందిస్తుంది.
ఇక, 28 రోజుల పాటు ఉచిత వాయిస్ కాల్స్ తో పాటు 1GB రోజువారీ డేటాను రూ. 108 రిచార్జ్ ప్లాన్ తో అందిస్తుంది.
BSNL మొబైల్ రిచార్జ్ ప్లాన్లు.. జియో, ఎయిటెల్ కంపెనీల కంటే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. దీంతో అందరూ BSNL నెట్ వర్క్ లోకి మారేందుకు మొగ్గు చేపే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని BSNL కూడా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.