నచ్చిన నంబర్‌తో బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవచ్చు

జియో, ఎయిర్టెల్ ఛార్జీలు పెంచడంతో అంతా ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల రేట్లు కూడా తక్కువగా ఉండటంతో యాజర్లు అటు వైపు షిప్ట్ అవుతున్నారు. దీనికి తోడు పైగా బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలను విస్తరించింది కూడా. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ కు మారే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది కూడా. దీంతో యాజర్లను మరింతగా అట్రాక్ట్ చేసేందుకు బంపరాఫర్ లను కూడా అందిస్తోంది. యూజర్లు నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను బీఎస్ఎన్ఎల్ గత కొన్నేళ్లుగా అందిస్తోంది.
ఫ్యాన్సీ నంబర్ కావాలంటే ఇలా చేయాలి
ముందుగా గూగుల్‌లో BSNL Choose Your Mobile Number అని సెర్చ్ చేయాలి.
ఆ తరువాత CYMMపై క్లిక్ చేసి జోన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత నచ్చిన నంబర్ల కోసం వెతికేందుకు ప్రత్యేక ఆప్షన్లను తీసుకొచ్చింది. అందులో ‘‘search with series, start number, end number, sum of numbers’’ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
ఫ్యాన్సీ నంబర్ కోసం పక్కనే ఫ్యాన్సీ నంబర్ ట్యాబ్ కూడా ఉంటుంది.
వీటిలో ఒక ఆప్షన్‌ను ఎంచుకొని మీకు నచ్చిన అంకెలను ఎంటర్ చేసి ‘search’పై క్లిక్ చేయాలి.
మీరు ఎంటర్ చేసిన నంబర్ ఆధారంగా కొన్ని ఫోన్ నంబర్లను చూపుతుంది.
అందులో నచ్చిన నంబర్ ఎంచుకున్నాక దాన్ని రిజర్వ్ చేసుకొనేందుకు ‘Reserve Number’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీరు ఎంచుకున్న నంబర్ రిజర్వ్ అవుతుంది.
ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో సిమ్ తీసుకోవాలి.