పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న తపస్
పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న తపస్

పల్లవి, చేగుంట: నార్సింగి మండల ప్రధానోపాధ్యాయులు, మండల ఎంఈఓ మురళీమోహన్, కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారావు చేగుంట మండలం, ఝాన్సీ లింగాపూర్ రామాయంపేట మండలం ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందరాచారి, వారి పదవి విరమణ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం,చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పదవీ విరమణ అనంతరం వారు దేశ సేవలో పాల్గొనాలని, దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని, పిల్లల్లో జాతీయవాదం పెంపొందించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట, చేగుంట, నార్సింగి మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట స్వామి, సంతోష్, రావుల వెంకటేష్, కృష్ణమూర్తి, స్వామి, నాగవేందర్ రావు, మల్లేష్, శ్రీనివాస్, సిద్దిరాములు, మన్నే గోపాల్, యాదగిరి, సంతోష్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.