నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి: తపస్
నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి: తపస్

పల్లవి, నర్సాపూర్: నర్సాపూర్ పట్టణం తపస్ కార్యాలయంలో పత్రికా విలేకరులతో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ మాట్లాడారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని, దీని వల్ల విద్యార్థులలో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని, విద్యార్థులకు నచ్చిన వృత్తిని ఎంచుకొని ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుందని, నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుందని, సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందని, నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందడానికి ఉపయోగపడుతుందని అన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, పదవీ విరమణ ద్వారా ఖాళీలైనా వాటిని పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నాయిని నరేందర్ గౌడ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.