నా ఫ్యామిలీ జోలికొస్తే నరుకుతా
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఏప్రిల్ 6న శ్రీరామనవమి శోభాయాత్రను వైభవంగా నిర్వహిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శోభయాత్ర జరిగే రూట్ లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్యాచ్ వర్క్, ట్రీ కటింగ్, లైట్లు తదితర వాటిని పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. శోభాయాత్ర రూట్‌ను బైక్‌పై తన కొడుకుతో కలిసి పరిశీలించారు. ప్రతిసారి పోలీసులు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని..ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని అధికారులను కోరారు. పోలీసులు ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. అంతేకాకుండా తన జోలికి, తన ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే అడ్డంగా నరుకుతానంటూ హెచ్చరించారు. కాగా గత కొంతకాలంగా రాష్ట్ర అగ్రనేతలపై రాజాసింగ్ ఫైర్ అవుతున్నారు. తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Related News
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
బరువు తగ్గాలనుకునేవాళ్లకు శుభవార్త..!
-
బీజేపీతో పొత్తు వల్లే ముస్లింల ఓట్లు కూటమికి రావు -రాజాసింగ్
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
గాలి మోటర్‌లో తిరుగుతూ రేవంత్ రెడ్డి గాలి మాటలు-ఏలేటి మహేశ్వర్ రెడ్డి



