పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ (సరూర్ నగర్)లో గురు పౌర్ణమి వేడుకలు

పల్లవి, వెబ్ డెస్క్ : సరూర్ నగర్ లోని పల్లవి ఇంటర్నేషన్ స్కూల్ ప్రాంగణంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లవి గ్రూప్స్ చైర్మన్, డీపీఎస్ చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హజరయ్యారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుండి విద్యార్థులలో గురువుల పట్ల గౌరవం , విలువలను పెంపొందించడంలో భాగంగా వినూత్న రీతిలో “పాదపూజ” అనే నేపథ్యంలో అందరికీ మొదటి గురువు అమ్మ కావున అమ్మకు మొదట పాదపూజ చేసి తర్వాత గురువులకు పాదపూజను చేశారు.పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. విద్యార్థులు ఆదర్శ ప్రాయమైన వివిద గురువుల వేషధారణతో పాఠశాల ఆవరణలో ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు .తరువాత ప్రధానోపాధ్యాయురాలు గారు మాట్లాడుతూ, గురు పౌర్ణమి అంటే ఉపాధ్యాయులను గౌరవించడం మాత్రమే కాకుండా వారి నిబద్ధత మరియు దృక్పథం ద్వారా ప్రపంచాన్ని మార్చిన గురువుల వారసత్వాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు
ఈ సందర్భంగా చైర్మన్ మల్క కొమరయ్య మాట్లాడుతూ విద్యార్థులకు, టీచర్స్ కు, సిబ్బందికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. మన మొదటి గురువులు అయిన తల్లి దండ్రులను ,ఉపాధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. గురు పౌర్ణమి సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక, సాంప్రదాయ కార్యక్రమాలను తిలకరించారు. అందర్ని మెచ్చుకున్నారు.
Related News
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్