Vettaiyan: బంపర్ ఆఫర్.. వేట్టయాన్ టికెట్ ధరలు తగ్గాయి
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’. దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిచిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజు నుండే మంచి టాక్ సంపాదించుకున్న

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’. దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కిచిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజు నుండే మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతొంది. దసరా సెలవులు కావడంతో ఆడియన్స్ కూడా ఈ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో ఇప్పటి వరకు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
అయితే దసరా సెలవులు ముగియడంతో ఈ వేట్టయాన్ సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. అదేంటంటే.. దసరా సెలవులు ముగియడంతో కలెక్షన్స్ పెంచేందుకు టికెట్ రేట్స్ తగ్గిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. తగ్గిన రేట్స్ ప్రకారం మల్టీ ప్లెక్స్‌లలో రూ. 200, సిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 150, డిస్ట్రిక్ట్ సింగిల్ థియేటర్లలో రూ. 110గా టికెట్ రేట్లు ఉండనున్నాయి. ఈ రేట్లు అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అది కూడా కేవలం తెలంగాణాలో మాత్రమే. మరి మారిన రేట్స్ వేట్టయాన్ కలెక్షన్స్ పెరగడానికి ఉపయోగపడతాయా చూడాలి.