Nకన్వెన్షన్ కూల్చొద్దంటే కేటీఆర్ సమంతని పంపాలన్నాడు!
చాలాకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సామ్..మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్నారు.

సమంత–నాగచైతన్య విడాకుల అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులముకుంది. నిన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశం అయితే.. ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకుంది. వీరి విడాకులకు కారణం బీఆర్ఎస్ ఎమ్మల్యే కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదాపూర్ లో ఇటీవల హైడ్రా కూల్చివేసిన ఉఎన్ కన్వెన్షన్ ని కూల్చడకుండా ఉండాలి అంటే సమంతనని తన దగ్గరకి పంపాలి అని అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్కినేని ఫ్యామిలీపై ఒత్తిడి తెచ్చారని..దీంతో నాగార్జున వాళ్లు కేటీఆర్ దగ్గరకి వెళ్లాలని సమంతని ఒత్తిడి చేశారని..అయితే సమంత అందుకు నిరాకరించిందని..దీంతో తాము చెప్పింది వింటే వినే లేకుంటే వెళ్లిపో అని ఆమెకు విడాకులు ఇచ్చారని బుధవారం తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోని సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అని మంత్రి అన్నారు. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ల జీవితాలతో కేటీఆర్ అడుకున్నడని మంత్రి చెప్పారు. కేటీఆర్ కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఏ మాయ చేశావే సినిమా షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డ నాగచైతన్య–సమంత పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్లకే 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సినిమాలు కూడా తగ్గించింది సమంత. చాలాకాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సామ్..మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్నారు. తిరిగి కోలుకుని వెబ్ సిరీస్ లు, సినిమాల ద్వారా తిరిగి యాక్టీవ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, నాగచైతన్య ఇటీవల నటి శోభితా దూలిపాళ్లతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.