‘మిరాయ్’ సూపర్ యోధ.. తేజ పోస్ట్ వైరల్
‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందులో ‘మిరాయ్’ ఒకటి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తు్న్నారు.
‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అందులో ‘మిరాయ్’ ఒకటి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తు్న్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త పోస్టర్ ను ఆడియన్స్ తో పంచుకున్నాడు తేజ. “గత సంక్రాంతి నుండి నా ప్రయాణం ఎగురుతూ ప్రారంభమైంది. మీ ప్రేమతో అది ఇంకా కొనసాగుతోంది. లేవండి లేచి ఆకాశంలో గాలిపటాల్లా ఎగురుదాం. మా సూపర్ యోధా లాగానే గాలిపటంలా ఎగరండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండ్ అవుతోంది. ఇక మిరాయ్ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



