నన్ను అరెస్ట్ చేయలేదు.. షాకిచ్చిన శేఖర్ బాషా
ప్రముఖ రేడియో జాకీ, బిగ్ బాస్ సీజన్ 8 ఎలిమినేటేడ్ కంటెస్టెంట్ శేఖర్ భాషను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, విచారిస్తున్నారని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రముఖ రేడియో జాకీ, బిగ్ బాస్ సీజన్ 8 ఎలిమినేటేడ్ కంటెస్టెంట్ శేఖర్ భాషను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, విచారిస్తున్నారని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నటి హత్యచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే శేఖర్ భాషను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఐదు విషయంపై స్పందించాడు శేఖర్ బాషా. ఈమేరకు ఓ వీడియో బైట్ కూడా విడుదల చేశాడు.
“నన్ను పోలీసులు అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటిదేం జరుగలేదు. నేను ప్రో కబడ్డీ లీగ్ చూసేందుకు గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లాను. అక్కడ నా ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. అందుకే అందుబాటులోకి రాలేకపోయాను. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన అరెస్ట్ పై వస్తున్న వార్తలు చెక్ పడింది.



