ఓటీటీకి ఎమోషనల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ స్టార్స్ కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. 96 ఫేమ్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ స్టార్స్ కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. 96 ఫేమ్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ టాక్ వచ్చింది. అయితే మరోపక్క ఎన్టీఆర్ నటించిన దేవర ఉండటంతో ఆ పోటీని తట్టుకోలేకపోయింది ఈ మూవీ. దాంతో సినిమాకు అనుకున్నంత ఆదరణ దక్కలేదు. ఇక అప్పటినుండి సత్యం సుందరం మూవీ ఓటీటీ విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
ఇక సత్యం సుదరం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాను అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని టాక్. మరి థియేటర్స్ లో అంతగా ఆకట్టుకొని సత్యం సుందరం సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



