సమంత క్రేజీ పోస్ట్.. బ్యాక్ టూ షూట్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న బ్యూటీ సమంత. సిటాడెల్ వెబ్ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ లో బిజీగా మారిన ఈ బ్యూటీ విడుదల తర్వాత రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న బ్యూటీ సమంత. సిటాడెల్ వెబ్ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ లో బిజీగా మారిన ఈ బ్యూటీ విడుదల తర్వాత రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెల్రబేషన్స్ కోసం యూఎస్ టూర్ కి వెళ్లిన విషయం తెల్సిందే. యూఎస్‌లో తన వర్కవుట్ సెషన్‌తోపాటు ఇతర విషయాల గురించి అప్డేట్స్ను నెట్టింట షేర్ చేసుకుంది.
అయితే సామ్ తన లాంగ్ ట్రిప్ వెకేషన్ ముగించుకొని ఇండియాకు తిరిగొచ్చేసింది. బుధవారం చెన్నై, ముంబైలో జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొంది. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో వరల్డ్ పికిల్ బాల్ లీగ్ కోసం చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీని లాంచ్ చేసింది. ఈవెంట్ ముగిసిన తర్వాత ముంబైకి పయనమైంది. మళ్లీ చాలా కాలం తర్వాత తన కొత్త వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది. ఇప్పుడీ అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు సామ్ అభిమానులు. విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు.



