వాళ్ళు పట్టించుకోరు.. SKN సంచలన కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ క. దర్శకద్వయం సుజీత్-సందీప్ తెరెకక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ క. దర్శకద్వయం సుజీత్-సందీప్ తెరెకక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది ఈ మూవీ. అయితే.. మంచి హిట్ టాక్ తెచ్చుకున్న క సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సరైన సంఖ్యలో థియేటర్స్ లభించలేదు. ఆ విషయంలో ఆడియన్స్ డిజప్పాయింట్ లో ఉన్నారు.
ఈ విషయంలో సినీ పెద్దలను రిక్వెస్ట్ చేసుకున్నారు. “చెన్నైలో 5 లేదా పది షోలు ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడి తెలుగు వాళ్ళు అడుగుతున్నారు. అయినా కనీసం 5 షోలు కూడా వేయించలేకపోతున్నాం. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను” అన్నారు కిరణ్. కిరణ్ వ్యాఖ్యలపై నిర్మాత SKN స్పందించారు. “మన తెలుగు ఆడియన్స్, మన ఫిలిం ఇండస్ట్రీ అన్ని భాషల సినిమాలను, హీరోలను మనవాళ్ళ లాగే ఫీలవుతారు. కానీ, అక్కడ మనల్ని కనీసం పట్టించుకోరు. ఈ విషయాన్నీ జీర్ణించుకోవడం చాలా కష్టం” అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం SKN చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి SKN ట్వీట్ పై తమిళ సినీ పెద్దలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



