టాక్సిక్ లో నయన్.. కన్ఫర్మ్ చేసిన స్టార్
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో ‘టాక్సిక్’ మూవీ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో ‘టాక్సిక్’ మూవీ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ గ్లింప్స్ విడుదల చేసి హైప్ పెంచిన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు అక్షయ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ ‘‘ప్రస్తుతం నేను యశ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఇందులో నయనతార కూడా నటిస్తున్నారు. ఇంతకు మించి వివరాలు నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి మీరు నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఓ కీలక ప్రకటన విడుదల చేసి చెప్తారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అక్షయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



