విడాకుల వార్తల పై నయనతార రియాక్షన్ ఇదే..!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ తో విడాకులు తీసుకుంది. అందుకే గత కొంతకాలం నుంచి నయనతార తన భర్తకు దూరంగా ఉంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు తెగ గుప్పుమన్నాయి.
ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అంటూ తేడా లేకుండా గత కొద్ది రోజులుగా ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా నటి నయనతార తనదైన శైలీలో ఈ వార్తలకు సమాధానం చెప్పింది.
తన భర్త విఘ్నేష్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ‘ మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే ‘ అని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు విఘ్నేష్ తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా, లితిసిస్ట్ గా పని చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు.