Naga Manikanta: భార్యను కలిసిన నాగ మణికంఠ.. ఫోటో వైరల్
బిగ్ బాస్ ముందు వరకు నాగ మణికంఠ గురించి ఎవరికీ తెలియదు. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటివారంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమ్ ఐపోయాడు మణికంఠ. తన భార్య, పాపను కలవాలని దానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ ఫార్మ్ అని చెప్పుకుంటూ గుక్కపట్టి ఏడ్చాడు మణికంఠ.

బిగ్ బాస్ ముందు వరకు నాగ మణికంఠ గురించి ఎవరికీ తెలియదు. కానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటివారంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమ్ ఐపోయాడు మణికంఠ. తన భార్య, పాపను కలవాలని దానికి బిగ్ బాస్ మంచి ప్లాట్ ఫార్మ్ అని చెప్పుకుంటూ గుక్కపట్టి ఏడ్చాడు మణికంఠ. ఇక అక్కడినుండి ఆడియన్స్ అతనికి చాలా కనెక్ట అయ్యారు. తన ఎమోషనల్ లో జెన్యూనిటీ ఉందని భావించిన ఆడియన్స్ అతన్ని ప్రతీవారం సేవ్ చేసుకుంటూ వచ్చారు.
ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నాగ మణికంఠ అవుతాడా అనే రేంజ్ అతనికి ఆడియన్స్ సపోర్ట్ దొరికింగి. కానీ, అనూహ్యంగా గతవారం తనకు తానుగా ఇంటినుండి బయటకు వచ్చేశాడు మణికంఠ. అది చూసి ఆడియన్స్ సైతం అవాక్కయ్యారు. భార్య, పిల్లల కోసం హౌస్ లోకి వచ్చాను అన్నాడు అది తీరకుండానే బయటకు వెళ్ళిపోయాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
కానీ, తాను బిగ్ బాస్ కి వచ్చిన కారణం నెరవేరింది అంటూ ఆడియన్స్ కు షాకిచ్చాడు మణికంఠ. తాజాగా తన భార్య ప్రియతో దిగిన ఫోటోను సోషల్ మీడియాల షేర్ చేశాడు. నా భార్య నాదగ్గరకు వచ్చేసింది, లెటర్ వచ్చినప్పుడే మేము కలిసిపోయాం అంటూ రాసుకొచ్చాడు మణికంఠ. అదిచూసిన నెటిజన్స్ మణికంఠ విషయంలో హ్యాపీ ఫీలవుతున్నారు. మీరు ఇద్దరు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ మణికంఠ, ప్రియాకి సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక