‘డెకాయిట్’లో మృణాల్.. ఫస్ట్ లుక్ సూపర్
అడివి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. అన్నపూర్ణ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శనియేల్ డియో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. అడివి శేష్, మృణాల్ ఒక కారులో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరికొత్త కథా కథనాలతో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.