సమంత అద్భుతంగా చేసింది.. ముందు భయమేసింది
సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ మూవీ బేబీ జాన్. వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కలీస్ తెరకెక్కిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ తేరికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ మూవీ బేబీ జాన్. వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కలీస్ తెరకెక్కిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ తేరికి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
“తమిళ తేరి సినిమాలో సమంత అద్భుతంగా నటించింది. నిజానికి నాకు రీమేక్ చేయాలంటే చాలా భయం. ఎందుకంటే ఒరిజినల్ సినిమాతో కంపేరిజన్స్ చేస్తారు. కానీ, బేబీ జాన్కి మాత్రం ఆ క్యారెక్టర్ని అందంగా తీర్చిదిద్దడం వల్ల నాకు భయం అనిపించలేదు” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



