మహానటి పెళ్లి.. తిరుమలలో ప్రకటించిన కీర్తి
తన అభిమానులకు హీరోయిన్ కీర్తిసురేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో అంటే డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వెల్లడించింది.
తన అభిమానులకు హీరోయిన్ కీర్తిసురేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో అంటే డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వెల్లడించింది. శుక్రవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు కీర్తి. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం కీర్తి మీడియాతో మాట్లాడుతూ.. తన పెళ్లికి సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టారు. గోవాలో తన పెళ్లి జరగబోతుందని చెప్పారు. తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల కానుందని, అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు. కీర్తికి కాబోయే భర్త విషయానికి వచ్చేసరకి అతని పేరు ఆంటోని తట్టిళ్.. ఇతనితో గత 15 ఏళ్లుగా కీర్తి ప్రేమలో ఉంది. ఇటీవల దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోని కీర్తి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
మలయాళ ప్రొడ్యూసర్ సురేశ్, నటి మేనకల కూతురై కీర్తి. ఈమెకు చెల్లెలలు కూడా ఉంది. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన కీర్తి.. మలయాళీ సినిమా గీతాంజలితో నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఇక తెలుగులో నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమై.. మహానటి సినిమాతో స్టార్ హోదా అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తుంది. రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాల షూట్లతో బిజీగా ఉంది. అయితే పెళ్లాయ్యాక కీర్తి సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది చూడాలి.



