Jyothi Rai: బిగ్ బాస్లోకి గ్లామర్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చేసిందిగా
నటి జ్యోతి రాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రల్లో ఆమె తెలుగువాళ్ళ మనసులు గెలుచుకుంది. ఈ సీరియల్ లో ఆమె నటనకు ఆడియన్స్ ఇంప్రెస్ అయిపోయారు. కానీ, కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి తెలుగు ఆడియన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. గుప్పెడంత మనసు సీరియల్ లో పద్దతిగా చీరకట్టుకొని కనిపించిన ఆమె గ్లామర్ షోతో రెచ్చిపోవడంతో నెటిజన్స్ అవాక్కయ్యారు.
తన హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది ఈ బ్యూటీ. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఆమెను హీరోయిన్ మెటీరియల్ అంటూ ఆకాశానికెత్తేశారు. దాంతో జ్యోతికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ ఫేమ్ తోనే ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చింది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. అది తెలుగు కాదు కన్నడ బిగ్ బాస్ లో. అవును ఈ మధ్యే బిగ్ బాస్ టీమ్ ఆమె అప్రోచ్ అయ్యారట.
ఇదే విషయాన్ని జ్యోతి రాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బిగ్ బాస్ టీమ్ నన్ను అపోర్చ్ అయిన మాట నిజమే. కానీ, నేను నో చెప్పాను. ప్రస్తుతం నాకున్న కమిట్మెంట్స్ కారణంగా బిగ్ బాస్ కి టైం ఇవ్వలేకపోతున్న. బిగ్ బాస్ టీమ్ నన్ను కన్సిడర్ చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు. అలాగే నన్ను సపోర్ట్ చేస్తునందుకు ఫ్యాన్స్ కి కూడా నా కృతజ్ఞతలు.. అంటూ చెప్పుకొచ్చారు జ్యోతి. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. నిజంగా జ్యోతి రాయి గనుక బిగ్ బాస్ లోకి వస్తే జెస్ట్ ఆమె గ్లామర్ కోసమే షో చూసేవాళ్ళు చాలా మందే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కనీసం నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ లోనైనా ఆమె కనిపిస్తారా అనేది చుడాలి.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



