టాటా, మారుతీ సేల్స్ డౌన్ .. ఆగస్టులో తగ్గిన అమ్మకాలు
పల్లవి, బిజినెస్ డెస్క్: దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థలు మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ 2024 ఆగస్టులో అమ్మకాలు క్షీణించాయి. మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు 3.9 శాతం తగ్గాయి. టాటా మోటార్స్ అమ్మకాల గణాంకాలలో 8 శాతం పడిపోయాయి.దిగ్గజ ఆటోమెుబైల్ తయారీ సంస్థలైన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు ఆగస్టు నెలలో పడిపోయాయి. మారుతి సుజుకి ఇండియా ఆగస్టులో 181,782 యూనిట్ల అమ్మకాలను చేసింది. 2023 ఆగస్టు నెలలో చూసుకుంటే.. 189,082 యూనిట్లు అమ్ముడయ్యాయి.
దేశీయంగా 1,45,570 యూనిట్లు అమ్మగా, 26,003 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. మారుతి సుజుకి ఇండియా షేరు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తర్వాత 0.24 శాతం తగ్గి రూ.12,421.25 వద్ద ముగిసింది. మినీ, కాంపాక్ట్ కార్లను కవర్ చేసే చిన్న కార్ల విభాగంలో అమ్మకాల గణాంకాలు పడిపోవడంతో ఆగస్టు అమ్మకాల క్షీణత కొనసాగింది.ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలు 18.85 శాతం క్షీణించి 68,699 యూనిట్లకు పరిమితమయ్యాయని సేల్స్ డేటా తెలిపింది. ఆగస్టులో కంపెనీ దేశీయ విక్రయాలు 8.4 శాతం క్షీణించి 1,43,075 యూనిట్లకు పడిపోయాయి. మారుతి సుజుకి ఎగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 5.64 శాతం వృద్ధితో 26,003 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.
తగ్గిన కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు..
మరోవైపు టాటా మోటార్స్ ఆగస్టులో 70,006 యూనిట్ల అమ్మకాలను చూసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 76,261 యూనిట్లతో పోలిస్తే ఇది తక్కువ. కంపెనీ డేటా ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ కమర్షియల్ పర్పస్ వాహనాల అమ్మకాలు 15 శాతం క్షీణించి 27,207 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 3 శాతం క్షీణించి 44,142 యూనిట్లకు పరిమితమయ్యాయి.టాటా మోటార్స్ షేరు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తర్వాత 0.92 శాతం క్షీణించి రూ.1,109.40 వద్ద ముగిసింది.



