వరల్డ్ లో మోస్ట్ పవర్ ఫుల్ కారు ఇదే!
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కారు ఇదే. దీని వేగం, ఇతర ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ చూడండి.
ప్రపంచంలో అనేక రకాల కార్ల కంపెనీలు రకరకాల కార్లను తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. కొన్ని బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. కొన్ని మంచి స్పీడ్ కలిగి ఉంటాయి.. కొన్ని అద్భుతమైన మైలేజీని అందిస్తాయి. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కారు ఏదో మీకు తెలుసా?
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కారు పేరు ‘వెనోమ్ F5-M రోడ్ స్టర్(Venom F5-M Roadster)’.హైపర్ కార్ల తయారీలో గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన హెన్నెస్సీ స్పెషల్ వెహికల్స్ అనే కంపెనీ దీన్ని తయారుచేసింది. భూమిపై ఇప్పటివరకు తయారుచేసిన అత్యంత శక్తివంతమైన మాన్యువల్ ట్రాన్స్మిషన్ కారు ఇదేనని కంపెనీ తెలిపింది. కారు డిజైన్ పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో రూపొందించబడింది. డ్రైవర్ కాకుండా ఒకరు కూర్చోడానికి మాత్రమే స్థలం ఉంది. ఈ కారులో 6 ట్రాన్స్మిషన్ ఫ్యూరీ V8 ఇంజిన్ ఉంది. దీని పవర్ 1,817 bhp.
ఈ కారు ట్రక్ కంటే మూడు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఈ కారు కేవలం కొన్ని సెకన్లలో గంటకు 357 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు ధర దాదాపు రూ.25 కోట్లు ఉంటుంది. ఇప్పటివరకు కంపెనీ కేవలం 12 కార్లను మాత్రమే తయారు చేయగా.. ధర ఎక్కువ ఉన్నప్పటికీ అవన్నీ అమ్ముడయ్యాయి. ఈ కార్లని కొనాలని ఆసక్తి ఉన్నవాళ్లు కంపెనీ వెబ్ సైట్ HennesseySpecialVehicles.com ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.




