Honda Activa : నిమిషంలోనే ఫుల్ ఛార్జ్ బ్యాటరీ
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాహనదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని.. సంస్థలు సైతం విభిన్న వేరియంట్లు, రకరకాల ఫీచర్లతో ఈవీ వాహనాలను రూపొందిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాహనదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని.. సంస్థలు సైతం విభిన్న వేరియంట్లు, రకరకాల ఫీచర్లతో ఈవీ వాహనాలను రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా టూవీలర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే బ్యాటరీ ఛార్జింగ్ కొన్నిసార్లు ప్రధాన సమస్యగా మారుతోంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న హోండా ఇటీవల సరికొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చింది.
హోండా టూ వీలర్స్ ఇండియా ఇటీవలే.. యాక్టివా ఈ, క్యూసీ1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. యాక్టివా ఈ.. రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తరువాత.. ఫుల్ ఛార్జ్ వున్న బ్యాటరీలను స్వాపింగ్ స్టేషన్లో తీసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. వీటిని కేవలం నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చని కంపెనీ కూడా చెబుతోంది. స్వాపింగ్ స్టేషన్ కు వచ్చాక.. స్మార్ట్ కీ ఉపయోగించి అక్కడ బ్యాటరీలను తీసుకోవచ్చు. అదే సమయంలో స్కూటర్లోని బ్యాటరీలను రిమూవ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి సంస్థ చెప్పినట్లుగానే బ్యాటరీని నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చు.
ఒక్కో బ్యాటరీ బరువు 10.2 కేజీలు ఉంటుంది. స్కూటర్ రెండు బ్యాటరీలతో 102 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం. కాగా ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగం అందుకుంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమగానే ఉంటుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరిలో మొదలవుతాయని సంస్థ వర్గాలు తెలిపాయి.



