ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేస్తున్నారా?..ఇది తెలిస్తే బిత్తరపోతారు!
మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ రావడం వంటి ఘటనలు ఇటీవల తరచుగా చూస్తూ ఉన్నాం.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ షాపింగ్ మోసాలు కూడా పెరిగిపోయాయి. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ రావడం వంటి ఘటనలు ఇటీవల తరచుగా చూస్తూ ఉన్నాం. మనం ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుక రాయి రావడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్నిసార్లు ఆర్డర్ పెట్టిన చాలా రోజులకు అది డెలివరీ అవుతుంటది..అది కూడా అందులో మనం పెట్టిన వస్తువు కాకుండా మరొకటి ఉంటుంది. ఏంటా ఇది అని కంప్లెయింట్ చేస్తే పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. అయితే తాజాగా బెంగళూరులో ఐఫోన్ ఆర్డర్ చేసిన ఓ మహిళకి మర్చిపోలేని అనుభవం ఎదురైంది.
పండుగ సీజన్ నేపథ్యంలో ప్రస్తుతం ఫ్లిప్ కార్డ్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ జరుగుతోంది. సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 6న ముగుస్తుంది. ఈ సేల్ స్మార్ట్ ఫోన్లు,గృహోపకరణాలు,ల్యాప్ ట్యాప్ లు వంటి అనేక రకాల ప్రొడక్ట్ లపై ఆఫర్లు అందిచబడుతున్నాయి. ఇక, మొబైల్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే ఐఫోన్ కూడా ఈ సేల్ లో తక్కువ ధరకు లభిస్తుండటంతో చాలామంది దీని కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ బెంగళూరు మహిళ కూడా iPhone 15 ని ఆర్డర్ చేసింది. దీని కోసం ఆమె ఓపెన్ బాక్స్ డెలివరీ (OBD)ఆప్షన్ ని ఎంచుకుంది. అయితే డెలివరీ బాయ్ ఇంటికొచ్చాడు..కానీ తెరిచి చూపించేందుకు మాత్రం నిరాకరించాడు. ఓపెన్ బాక్స్ డెలివరీ చేయలేనని.. బాక్స్ ను యథాతథంగా తీసుకోవాలి అని సదరు మహిళకు చెప్పాడు.
అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో అతడు తన జేబులో నుంచి ఫోన్ తీసి కొందరికి కాల్ చేసి మోడం మీరే మాట్లాడండి..ఓపెన్ బాక్స్ డెలివరీ సదుపాయం ఈ ఫోన్ కి లేదు అని చెప్నాడు. అయితే ఇదంతా గమనిస్తున్న ఆ మహిళ సోదరుడు వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన డెలివరీ బాయ్ మరొకరికి ఫోన్ చేయడంతో వెంటనే మరో డెలివరీ బాయ్ అక్కడకు వచ్చి ఓపెన్ బాక్స్ ని డెలివరీ చేస్తానని చెప్పాడు.పార్సిల్ లో ఐఫోన్ ఉంది..మీరు ఉంచుకోండి అని కస్టమర్ ఓపెన్ చేసి చూపించి ఇచ్చాడు. అయితే తాను వీడియో కనుక రికార్డ్ చేయకుండా ఉంటే తన సోదరికి ఐఫోన్ బదులు ఏదో నకిలీ ప్యాకేజీ ఇచ్చేవాడంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఓపెన్ బాక్స్ డెలివరీ ఎందుకు?
కస్టమర్‌లు తాము ఆర్డర్ చేసిన వాటిని సరిగ్గా పొందేలా ఈ సర్వీస్ రూపొందించబడింది. Flipkart ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ కింద కస్టమర్‌లు ప్యాకేజీని తెరిచి, దానిని అంగీకరించే ముందు దాని కంటెంట్‌లను చెక్ చేసే ఆప్షన్ ని పొందుతారు.



