ఐఫోన్ ధరలు తగ్గాయోచ్… లేటెస్ట్ రేట్స్ ఇవే
ఐఫోన్ కొనాలనుకునే వారికి మాత్రం ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే యాపిల్ కంపెనీ ధరలను తగ్గించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో కఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందించింది యాపిల్. దీంతో ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ధరలను తగ్గించిన తర్వాత ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేలు మేర తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ స్వల్పంగా తగ్గాయి. ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2 వేల 300 మేర తగ్గింది. తగ్గిన ధరలతో యాపిల్ తన వెబ్ సైట్ లో అప్ డేట్ చేసింది. యాపిల్ ఆపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి.
లేటెస్ట్ రేట్స్ ఇవే
ఐఫోన్13 (128 GB) ధర ఇంతకు ముందు రూ.59,600 , ఇప్పుడు ధర రూ. 53,600
ఐఫోన్ 13 (256 GB) ధర ఇంతకు ముందు రూ.69,600 ఇప్పుడు ధర రూ.63,600
ఐఫోన్ 13 (512 GB) ధర ఇంతకు ముందు రూ.89,600 ఇప్పుడు ధర రూ.83,600
ఐఫోన్ 14 (128 GB) ధర ఇంతకు ముందు రూ.69,600 ఇప్పుడు ధర రూ.63,600
ఐఫోన్ 14 (256 GB) ధర ఇంతకు ముందు రూ. 79,600 ఇప్పుడు ధర రూ.73,600
ఐఫోన్ 14 (512 GB) ధర ఇంతకు ముందు రూ. 99,600 ఇప్పుడు ధర రూ.93,600
ఐఫోన్ 14+ (128 GB) ధర ఇంతకు ముందు రూ. 79,600 ఇప్పుడు ధర రూ. 73,600
ఐఫోన్ 14+ (256 GB) ధర ఇంతకు ముందు రూ. 89,600 ఇప్పుడు ధర రూ. 83,600
ఐఫోన్ 14+ (512 GB) ధర ఇంతకు ముందు రూ. 109,600 ఇప్పుడు ధర రూ. 103,600
ఐఫోన్ 15 (128 GB) ధర ఇంతకు ముందు రూ. 79,600 ఇప్పుడు ధర రూ. 73,600
ఐఫోన్ 15 (256 GB) ధర ఇంతకు ముందు రూ. 89,600 ఇప్పుడు ధర రూ. 83, 600
ఐఫోన్ 15 (512 GB) ధర ఇంతకు ముందు రూ. 109, 600 ఇప్పుడు ధర రూ. 103, 600
ఐఫోన్ 15+ (128 GB) ధర ఇంతకు ముందు రూ. 89,600 ఇప్పుడు ధర రూ. 83,600
ఐఫోన్ 15+ (256 GB) ధర ఇంతకు ముందు రూ. 99,600 ఇప్పుడు ధర రూ. 93, 600
ఐఫోన్ 15+ (512 GB) ధర ఇంతకు ముందు రూ. 119,600 ఇప్పుడు ధర రూ. 113,600
ఐఫోన్ 15 Pro (128 GB) ధర ఇంతకు ముందు రూ. 129,800 ఇప్పుడు ధర రూ. 123,800
ఐఫోన్ 15 Pro (256 GB) ధర ఇంతకు ముందు రూ. 139, 800 ఇప్పుడు ధర రూ. 133, 800
ఐఫోన్ 15 Pro (512 GB) ధర ఇంతకు ముందు రూ. 159, 700 ఇప్పుడు ధర రూ. 153,700
ఐఫోన్ 15 Pro (1 Tb) ధర ఇంతకు ముందు రూ. 179,400 ఇప్పుడు ధర రూ. 173,400
ఐఫోన్ 15 Pro Max (256 GB) ధర ఇంతకు ముందు రూ. 154,000 ఇప్పుడు ధర రూ. 148,000
ఐఫోన్ 15 Pro Max (512 GB) ధర ఇంతకు ముందు రూ. 173,900 ఇప్పుడు ధర రూ. 167,900
ఐఫోన్ 15 Pro Max (1 Tb) ధర ఇంతకు ముందు రూ. 193,500 ఇప్పుడు ధర రూ. 187,500



