మౌలాలి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: మెట్రో చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంఎంటీఎస్ ను సద్వినియోగం చేసుకునేలా రైల్వే అధికారులు ప్రయత్నాలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. శుక్రవారం అరుణ్ కుమార్ జైన్ ను కలిసిన ఆయన.. పలు అంశాలపై చర్చించారు. ఎన్ఎఫ్ సీ దగ్గర బ్రిడ్జి విస్తరణ, మౌలాలి స్టేషన్ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ కు ప్యాసింజర్లకు కనీస సౌకర్యలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఐడీసీ, రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.