ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా రిటైర్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ అనురాధను నియమించింది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా రిటైర్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ అనురాధను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో ఆమెను నియమిస్తూ ఏపీసీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా అనురాధ బాధ్యతలు నిర్వహించారు.
ఈ పోస్టుకు చాలామంది పేర్లు వినిపించిన ఫైనల్ గా ఏఆర్ అనురాధ వైపు మొగ్గుచూపింది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చించిన తర్వాత ఆమె నియామకం జరిగిందని తెలుస్తోంది. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారే. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.
Related News
-
మాట ఇచ్చారు. నెరవేర్చారు
-
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి -మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
ఖమ్మంలో అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్
-
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
నా కొడుకే వైఎస్సార్ వారసుడు – వైఎస్ షర్మిల
-
ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు