మహేంద్ర హిల్స్ లో ఇన్వెస్టిట్యూర్ వేడుక

పల్లవి, హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మహేంద్ర హిల్స్ క్యాంపస్ లో ఇన్వెస్టిట్యూర్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట ముఖ్య అతిథిగా మాదిరెడ్డి ప్రతాప్, ఐపీఎస్, హెచ్ఎండీఏ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ షేక్ మీరా, డీపీఎస్, పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమురయ్య, సీఈవో మల్క యశస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుంకర నందితా కొత్తగా ఎన్నికైన విద్యార్థుల పేర్లు ప్రకటించగా.. ముఖ్య అతిథులు వారిని అభినందించి బ్యాడ్జీలు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. స్కౌట్స్, డ్స్ కవాతు బృందం సగర్వంగా తమ జెండాలను ఎగురవేసి ఔరా అనిపించింది. మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థులు వైఫల్యాలను విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిరణ్మయి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.



