రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడు..తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
లకిడికపూల్ లో హోటల్ అశోకలో ఆదివారం జరిగిన బీసీ కులాల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న తీన్మార్ మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని..2028 లో బీసీ నేత ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆయన అన్నారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లను జనాభా ప్రకారం పెంచాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ లోని లకిడికపూల్ లో హోటల్ అశోకలో ఆదివారం జరిగిన బీసీ కులాల రాష్ట్ర సదస్సులో పాల్గొన్న తీన్మార్ మల్లన్న..రాజకీయాలు,ఉద్యోగాలలో బీసీలకు అన్యాయం జరుగుతోందని,లెక్క ప్రకారం దక్కాల్సిన ఫలాలు బీసీలకు అందడం లేదన్నారు. గతంలోలాగా ఇప్పుడు బీసీలు లేరని..బీసీలలో చైతన్యం వచ్చిందన్నారు. తెలంగాణకి 10 ఏళ్లు సీఎంగా తానే ఉంటానని రేవంత్ రెడ్డి అంటుండగా..2028లో మాత్రం బీసీనే ముఖ్యమంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ బీసీ రాజ్యంగా మారబోతుందన్నారు.
బీసీలకు తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల రూపకల్పన,సమగ్ర కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయించే బాధ్యత తనదేనని మల్లన్న చెప్పారు. అయితే ఒకవేళ అది జరగకుంటే దానికి తాను బాధ్యత వహిస్తానని సృష్టం చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశ్యమన్నారు. తెలంగాణలో ఓసీల జనాభా 6.98శాతం మాత్రమేనని..వారికి ఈడబ్యూఎస్ రిజర్వేషన్ కింద నూటికి ఒకటి లేదా ఒకటిన్నర శాతం మాత్రమే దక్కాలని కానీ 10శాతం దక్కుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఈడబ్యూఎస్ కోటాని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక,రాష్ట్రంలోని కాంట్రాక్టులన్నీ అగ్ర కులాల వ్యక్తులకే దక్కుతున్నాయని..బీసీలలో కాంట్రాక్టర్లే లేరా అని ప్రశ్నించారు



