రేవంత్ ను ఇరకాటంలో పెట్టిన దానం నాగేందర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మరోకసారి ఇరకాటంలో పడేశారు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్. గతంలో తన మాట ఎవరూ వినడం లేదు. అధికారులు ప్రోటోకాల్ ను పాటించడం లేదు. ఓ ఎమ్మెల్యేగా.. సీనియర్ మాజీ మంత్రిగా తను చెప్పిన మాటను వినడం లేదు.
చెప్పిన పని చేయడం లేదని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలుమైన మేము చెప్పేవి వింటారు. మా అర్జీలను తీసుకోని చెత్తబుట్టలో వేస్తారని వ్యాఖ్యానించి సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు.
తాజాగా ఈనెల ఇరవై ఐదో తారీఖున జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల గురించి ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ కేసీఆర్ నిర్వహించబోయే ఈ సభ చాలా విజయవంతమవుతుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ జనాల్లోకి వస్తున్నారు. ఆయన కోసం.. ఆయన మాటల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈసభ ఖచ్చితంగా విజయవంతమవుతుందని అన్నారు.



