కీరన్ పొలార్డ్ రికార్డు..!

పల్లవి, వెబ్ డెస్క్ : వెస్టిండీస్ మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. అత్యధిక టీ20 మ్యాచులు ఆడిన ప్లేయర్ గా కీరన్ పొలార్డ్ నిలిచారు. ఇప్పటివరకు పొలార్డ్ 700 టీ20 మ్యాచులు ఆడారు.
అయితే అతడి తర్వాత డ్వేన్ బ్రావో (582), షోయబ్ మాలిక్ (557), రస్సెల్ (556), నరైన్ (551), డేవిడ్ మిల్లర్ (530), అలెక్స్ హెల్స్ (500), రవి బోపారా (486), రషీద్ ఖాన్ (477), మ్యాక్స్ వెల్ (471), క్రిస్ గేల్ (463), రోహిత్ శర్మ (463)లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.