డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
 
                                
పల్లవి, హైదరాబాద్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో 9,10,11,12వ తరగతుల స్టూడెంట్లకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సెషన్ ను నిర్వహించారు. డీఅడిక్షన్ థెరిపస్ట్ డాక్టర్ వీఎస్ గిడియాన్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే చెడు పరిణామాలపై స్టూడెంట్లకు అవగాహన కలిగించారు. డ్రగ్స్ బారిన పడి లైఫ్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో నాచారం డీపీఎస్ వైస్ ప్రిన్సిపాల్ సినీమోల్ నాయర్, మాస్ మీడియా ఫ్యాకల్టీ బన్సారీ త్రివేది పాల్గొన్నారు.


 
          



