గ్రాండ్ గా ముగిసిన డీపీఎస్ సొసైటీ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 26 డిపిఎస్ స్కూల్స్ నుండి మొత్తం 73 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్లు–మేనేజర్లు పాల్గొన్నారు.
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్టోబర్ 3–5 వరకు డీపీఎస్ సొసైటీ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్(గర్ల్స్–ఓపెన్)నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్ ప్రతిభ వెలుగులోకి తీసుకోచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 26 డిపిఎస్ స్కూల్స్ నుండి మొత్తం 73 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్లు–మేనేజర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పోర్ట్స్ డిపిఎస్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ & నేషనల్ కన్వీనర్ డాలీ చనన మాట్లాడుతూ… విద్యార్థి దశలో క్రీడల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఫలితంతో సంబంధం లేకుండా క్రీడలలో పాల్గొని ఆనందించేలా విద్యార్థులను ప్రోత్సహించారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ మనోజ్ కుమార్.. క్రీడలలో క్రమశిక్షణ, పట్టుదల ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం డిపిఎస్ వైస్ చైర్మన్ మల్క కొమరయ్య.. విద్యార్థులు తమ జీవితంలో క్రీడలను అంతర్భాగంగా చేసుకోవాలని సూచించారు. నాచారం డీపీఎస్ సీఈవో మల్క యశశ్వి.. యువకులు తమ అత్యున్నత సామర్థ్యాలతో ఆడేలా ప్రోత్సహించారు. ప్రిన్సిపల్, జూనియర్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈవెంట్ మొత్తంలో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించేలా వారిని ప్రోత్సహించారు.
మూడు రోజుల ఛాంపియన్షిప్ లో.. ఆటగాళ్ళు తమ అద్భుతమైన నైపుణ్యాలు, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 5వ తేదీన గ్రాండ్ వాల్డిక్టరీ వేడుకతో ఈ టోర్నమెంట్ ముగిసింది.

ఈ ఛాంపియన్షిప్ లో సింగిల్స్ టైటిల్ను ఫరీదాబాద్ డీపీఎస్ నుంచి పాల్గొన్న మేధావి నగర్ సాధించగా..డబుల్స్ టైటిల్ను బెంగళూరు ఈస్ట్ డీపీఎస్ కు చెందిన నేహా కృపేష్ గెల్చుకున్నారు.

ఈ ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎ.పి.జితేందర్ రెడ్డి (క్రీడల వ్యవహారాలు) సహా పలువురు అతిథులు అద్భుతమైన ప్రదర్శనలను అభినందించి, అర్హులైన విజేతలకు బహుమతులను అందజేశారు.




